29-03-2025 12:00:00 AM
హాజరైన మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పద్మారావుగౌడ్
వారాసిగూడ, మార్చి 28: సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్ వారాసిగూడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇ ఫ్తార్ విందులు సర్వమత సౌభాతృత్వాన్ని చాటుతాయన్నారు. ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌తోపాటు స్థానిక నాయకులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉన్నదన్నార. ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, రాసూరి సునీ త, యువనేత రామేశ్వర్‌గౌడ్, నిర్వాహకులు బషీర్, అబ్దుల్, మునావర్ తదితరులు పాల్గొన్నారు.