22-03-2025 09:00:20 PM
పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్...
పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్య శనివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారితో ఉపవాస దీక్షలు విరమింపజేశారు.