calender_icon.png 21 March, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24న పటాన్ చెరులో ఇఫ్తార్ విందు

20-03-2025 10:38:41 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. 

పటాన్ చెరు (విజయక్రాంతి): రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తునట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో గురువారం ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మతపెద్దల సూచనలకు అనుగుణంగా ఈ నెల 24వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ భారీ సంఖ్యలో విందుకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. గత 25 సంవత్సరాలుగా రంజాన్ పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత అందించడంతో పాటు సొంత నిధులతో మసీదులు, ఆశిర్ఖానాలు నిర్మించి వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపాడుతున్నట్లు తెలిపారు.