30-03-2025 12:21:28 AM
కాంగ్రెస్ నేత మోహన రాజు ఆధ్వర్యంలో నిర్వహణ
హాజరైన మైనంపల్లి హన్మంతరావు
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): మౌలాలిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోహన రాజు, స్థానిక ముస్లిం పెద్ద కమర్ భాయ్ కలిసి శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. గంగా జమున తెహజీబ్‌లాగే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయన్నారు. హిందువులకు, ఉగాది, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షుడు వెంక టేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్ ముస్లిం మంచ్ సౌత్ ఇండియా అధ్యక్షుడు సత్తార్ భాయ్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు వినోద్ యాదవ్, మైనారిటీ నాయకులు ఫరీద్ భాయ్, షకీల్, ఫరూక్, ఖుద్దూస్, క్రాంతి, దాస్ పాల్గొన్నారు.