calender_icon.png 10 March, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 8 న ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఇఫ్తార్ విందు

07-03-2025 02:34:32 PM

ఆప్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు ఆఫ్జల్ సలీం

ముషీరాబాద్,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ఈ నెల 8 న ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఇఫ్తార్ విందు(Iftar dinner) ఏర్పాటు చేస్తున్నామని ఆప్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు ఆఫ్జల్ సలీం తెలిపారు.  హైదరాబాద్ లోని లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా ఉపవాసాలు చేసేవారితో పాటు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు పాల్గొనటానికి ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

దేశంలోని అనేక ప్రాంతాల్లో మతతత్వ విద్వేషపూరిత చర్యలు సర్వసాధారణం అవుతున్న ఇలాంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) తెలంగాణ శాఖ  ఇఫ్తార్ విందు నిర్వహించడం ఆదర్శప్రాయమైన ఉదాహరణ అని అభివర్ణించారు. మత సామరస్యాన్ని బలోపేతం చేయడంలో చాలా దోహదపడే గొప్ప ఇఫ్తార్ విందు లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఆప్ మహిళా విభాగం నాయకురాలు నర్సింగ్ యమునా గౌడ్, డాక్టర్స్ విభాగం నాయకురాలు లక్ష్య నాయుడు, మైనారిటీ విభాగం నాయకులూ అజీమ్ బేగ్, షాబాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.