30-03-2025 08:54:44 PM
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ గాయాజుద్దీన్, రఫీ యుద్దీన్, సలీం, బషీర్, సోహెల్, కరీం ముస్లిం సోదరులు పాల్గొన్నారు.