29-03-2025 09:59:12 AM
చెరుకు శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ శ్రీకాంత్
చేగుంట,విజయక్రాంతి: మెదక్ జిల్లా చేగుంట పట్టణం(Chegunta town)లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్, ఎస్ ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.
ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని, తాను ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాసిల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు.అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని,మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, చేగుంట తాసిల్దార్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ముస్లిం సోదరులు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు