calender_icon.png 29 March, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు..

26-03-2025 10:28:27 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులకు మండల కేంద్రానికి చెందిన డాక్టర్ చంద్రమౌళి ‌ఆధ్వర్యం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని చంద్రమౌళి నివాసం ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందులతో సోదర భావం పెంపొంది, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, గంధం సైదులు, ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ జానీమియా, ఖాజామైదీన్, గౌస్, సైదా, వహిద్, పాషా, మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.