26-03-2025 12:37:01 AM
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్ పర్సన్ రజిని
కడ్తాల్, మార్చి 25 ( విజయ క్రాంతి ) : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉం డే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్ పర్సన్ రజిని అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పట్టణంలో ఎంబీఏ గార్డెన్ లో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ ఆధ్వర్యంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా జైపాల్ యాదవ్, రజిని, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్, రాష్ట్ర సర్పంచుల సంఘము అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహా రెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉప వాస దీక్ష విడిపించారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పరమేష్, యువజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్, రాహుఫ్, జావీద్, లాయక్ అలీ, నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.