calender_icon.png 26 March, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

24-03-2025 12:47:18 AM

  • ముస్లింల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి 

హనుమకొండ, మార్చి 23 (విజయక్రాం తి): పవిత్ర రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత,మతసామరస్యానికి ప్రతీక అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని జక్రియా ఫంక్షన్ హాల్లో వరంగల్ పశ్చిమ నియోజవర్గ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో ఆయన పాల్గొన్నారు.

సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులందరం కలిసి ముస్లిం సోదరులకు కబ రస్థాన్ కోసం 3 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించామని తెలిపారు.

ఈ మేరకు సం బధిత పత్రాలను ముస్లిం మత పెద్దలకు అందించారు. నియోజకర్గంలో దాదాపు 19 ఏళ్లుగా ప్రతియేటా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు చేస్తున్నానని, అల్లా ఆశీస్సులతో మీ ముందు ఎమ్మెల్యేగా నిలిచానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుం దన్నారు. రాజకీయంగా ముస్లింలకు ప్రత్యేక అవకాశాలను కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమం లో  ఎంపీ డాక్టర్ కడియం కావ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ పాషా, కూడా చైర్మన్  ఇనగాల వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కూసుర్ పాషా, వరంగ ల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, పీసీసీ మెంబర్స్ బత్తిని శ్రీనివాస్ రావు, ఈవి శ్రీనివాస్ రావు ,జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజీజ్ ఉల్లా బేగ్, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ జక్కుల శ్రీనివాస్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.