22-03-2025 01:35:59 AM
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి
కడ్తాల్, మార్చి 21 ( విజయ క్రాంతి ) : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉం డే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పట్టణంలో ఎంబీఏ గార్డెన్ లో మాజీ కో అప్షన్ సభ్యుడు జహంగీర్ బాబా ఆధ్వర్యంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.
సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉప వాస దీక్ష విడిపించారు. సర్వమత సారం ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహా, జిల్లా నాయకులు బీక్యా నాయక్, బీచ్యా నాయక్, నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.