27-03-2025 12:00:00 AM
బంజారాహిల్స్, మార్చి 26: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రెనోవా గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రెనోవా ఎన్‌ఐజీఎల్ హాస్పిటల్స్, రోడ్ నం.12, బంజారా హిల్స్‌లో ఇఫ్తార్ విందు నిర్వహించారు.
ఈ కార్యక్రామానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బంజారా హిల్స్ కార్పొరేటర్ మన్నె కవిత గోవర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, ఎమ్‌ఎల్‌ఏ కాలనీ బంజారాహిల్స్ అధ్యక్షుడు టి.నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింపజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులను డా. ఆర్‌వి రాఘవేంద్రరావు, డైరెక్టర్, రెనోవా ఎన్‌ఐజిఎల్ హాస్పిటల్స్, సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ డా. రాకేష్‌శర్మ, రెనోవా మిడ్ లెవల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సీఈవో డా. రాధాకృష్ణరావు సాగి, సీవోవో రవీంద్రనాథ్ గరగ, బిజినెస్ డెవలప్ మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జహీర్, సెంటర్ హెడ్ రామసుబ్బా రెడ్డి కొమ్మన పాల్గొన్నారు.