calender_icon.png 6 February, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్కో నానో ఎరువులపై అవగాహన సదస్సు

06-02-2025 06:48:33 PM

మంచిర్యాల (విజయక్రాంతి): రైతుల సహకార సంస్థ ఇఫ్కో ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా సహకార సంఘాల సిబ్బంది, ఫెర్టిలైజర్ ఇన్పుట్ డీలర్స్ కి వివిధ పంటలలో నానో ఎరువులు యాజమాన్యం గురించి గురువారం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా ఇఫ్కో తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కపా శంకర్, డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్ బి సంజీవరెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివ కృష్ణ లు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఇఫ్కో తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కపా శంకర్ మాట్లాడుతూ... భారతదేశంలో 35,000 కు పైగా ప్రాథమిక సహకార సంఘాలతో భాగస్వామ్యం పొంది ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంస్థగా రూపొందిందని అన్నారు.

వ్యవసాయంలో అధిక రసాయన ఎరువులు వినియోగించడం వలన నేల సారం తగ్గడమే కాకుండా సమస్యాత్మక నేలలుగా మారుతున్నయన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇఫ్కో సంస్థ నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను వాడాలని, రైతులకు సూచించారు. నానో టెక్నాలజీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మొట్టమొదటిసారిగా ఇఫ్కో సంస్థ నానో టెక్నాలజీని ఎరువుల తయారీకి ఆపాదించిందని తెలిపారు. నానో ఎరువులు వాతావరణానికి హాని చేయకుండా మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తుందన్నారు. రసాయనికి ఎరువులు అధిక వినియోగం వలన నేల, గాలి, నీరు కాలుష్యం అవుతుందని, రసాయనిక యూరియా డిఏపి ఎరువులను తగ్గించి వాటికి బదులుగా నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను వాడాలని సూచించారు.

అనంతరం మంచిర్యాల్ ఏడిఏ అనిత మాట్లాడుతూ... వివిధ రకాల పంటలలో నేరుగా యూరియా డిఎపి ఎరువులను కాకుండా సూక్ష్మ పోషక ఎరువులను కూడా అందిస్తేనే మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి మంచి దిగుబడిలను అందిస్తాయని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు వివిధ రకాల పంటలలో సేంద్రియ ఎరువుల యాజమాన్యం గురించి తెలిపారు. అనంతరం మంచిర్యాల జిల్లా డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ... సహకార సంఘాలను బలోపేతం చేయడం వలన రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా నానో యూరియా, నానో డి ఏపి ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ అనిత, ఇఫ్కో జిల్లా మేనేజర్ శ్రీధర్ కోరె, కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు, ఫర్టిలైజర్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు.