calender_icon.png 10 January, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకిత భావంతో పనిచేస్తే సమాజంలో గుర్తింపు..

09-01-2025 09:00:21 PM

పాపన్నపేట ఎంఈఓ ప్రతాప్ రెడ్డి... 

పాపన్నపేట: అంకితభావంతో పనిచేస్తే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పాపన్నపేట ఎంఈఓ ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని నర్సింగరావుపల్లి ప్రాథమిక పాఠశాల నుండి బదిలీ అయిన ఉపాధ్యాయురాలు సంధ్యరాణికి ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేసే వారికి ఎల్లప్పుడూ సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. ఉపాధ్యాయురాలు సంధ్యారాణి సేవలను కొనియాడారు. అనంతరం సంధ్యారాణి లక్ష్మణ్ గౌడ్ దంపతులు పాఠశాలకు రూ.25,000/- విలువ చేసే స్మార్ట్ టెలివిజన్ ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట, కుర్తివాడ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్, శ్రీనివాస్ రావు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి, ఉపాధ్యాయులు అజయ్, మౌనిక, విద్యార్థులు పాల్గొన్నారు.