calender_icon.png 19 November, 2024 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మాసిటీకి నీళ్లిస్తే పాలమూరుకు మట్టే

19-11-2024 04:27:05 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, నవంబర్ 18 (విజయక్రాంతి): కొడంగల్ ఫార్మాసిటీకి భీమా నుంచి ఏడు టీఎంసీల నీటిని తరలించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, అదే జరిగితే పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకద్ర, మక్తల్, వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు ఇది గొడ్డలి పెట్టు అన్నారు.

రైతులను బెదిరించి, భయపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చేస్తుందన్నారు. అదీకాకుండా ఫార్మాసిటీ కోసం కృష్ణ నీళ్లను వాడుకోవాలని చూస్తుందన్నారు. పాలమూరు రైతుల ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బ తింటాయన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఏడాది కాలంగా ఒక్క టీఎంసీ ఇచ్చే పనులు చేయలేదన్నారు.

ఒక్క రూపాయికూడా ఖర్చు పెట్టలేదన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే  సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ పనులు చేయకుండా పదకొండు నెలలుగా పడుకోబెట్టిండని విమర్శించారు. రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌కి రేపు సీఎం వెళ్తున్నాడని వరంగల్ నుంచే రైతుల తిరుగుబాటు ప్రారంభం అవుతుందన్నారు.