calender_icon.png 21 March, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాయిగా నిద్రపోవాలంటే!

02-03-2025 12:00:00 AM

పడుకునే సమయంలో కొందరికి దిండు లేకుంటే నిద్ర పట్టదు. మరికొందరు దిండు లేకుండానే నిద్రపోతారు. ఇలా ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు ఉపయోగిస్తారు. అయితే దిండు పెట్టుకుని నిద్రపోవడం కంటే అది లేకుండా నిద్రిస్తేనే ఎక్కువ లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. 

* దిండుతో నిద్రిస్తున్నప్పుడు మన ముఖం దానికి ఆనుకుని ఉంటుంది. ఆ దిండును సరిగా శుభ్రం చేయకుండా ఎక్కువ కాలంగా ఉపయోగిస్తే దానిపై ఉండే బ్యాక్టీరియా, మురికి వల్ల మొటిమల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

* ఎత్తుగా ఉన్న దిండు వేసుకుని పడుకుంటే మనకు వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే దిండు లేకుండా నిద్రపోతే వెన్నెముక నిటారుగా ఉండి ఎలాంటి నొప్పి ఉండదు. 

* దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. 

* చిన్న పిల్లలను పడుకోపెట్టేటప్పుడు వారికి దిండును అలవాటు చేయకండి. దీనివల్ల మెడకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుభ్రం చేయని దిండు వాడితే పిల్లలు వాటివైపు ముఖం పెట్టి శ్వాస తీసుకున్నప్పుడు బ్యాక్టీరియా శరీరంలోనికి ప్రవేశించి వారికి అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.