calender_icon.png 5 April, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నౌకరి చేయాలనుకుంటే ఎక్కువ చేయకు?

05-04-2025 12:38:54 AM

  • నీ ఉద్యోగం ఏంటి నువ్వు చేసేదేంటి?

రెవెన్యూ ఉద్యోగి పై ఓ నాయకుడి అనుచిత వ్యాఖ్యలు 

ఇసుక క్వారీ నుంచి వెళ్ళిపోవాల్సిందంటే హుకుం 

నేనేం చేయలేదు అంటున్న వినని ఆ నాయకుడు 

మూసాపేట్ ఏప్రిల్ 4 : నీకు మంచిగా చెబుతున్నా నౌకరి చేయాలనుకుంటే అక్కడ నుంచి.. ఉపయోగించని పదజాలంతో వెళ్లండి... ఇసుక క్వారీ దగ్గర నీకేం పని.... నిన్ను పంపించింది ఎవరు.. అంటూ ఓ నాయకుడు ఉపయోగించని పాఠశాలలతో రెవెన్యూ కు సంబంధించిన ఓ అధికారిని దూషించిన ఆడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మూసాపేట్ మండల పరిధిలో నిజాలు పూర్ గ్రామంలో ఇటీవల ఇసుక అనుమతులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు అనుమతి కంటే అత్యధికంగా ఇసుకను తరలిస్తున్నట్లు సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తుంది.. ఈ విషయంపై అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తాసిల్దార్ తో పాటు రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించిన పదజాలంతో తీవ్రంగా విమర్శలు చేశారు.

ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా రెవెన్యూ అసోసియేషన్ నేతలు  స్పందించలేదు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఘాన్సీరాం నాయక్ ఈ ఆడియో వైరల్ అయిన విషయం నిజమైన తేలితే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఏది ఏమైనా ఆడియో లో తీవ్ర బూతులు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ఈ ఆడియో వైరల్ గా చర్చనీయాంశంగా మారింది.

నాయకులు అధికారులను ఇలా తిడుతున్న ఎందుకు పడుతున్నారననే ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. నాయకుడు అధికారులు సమన్వయంతో ప్రజలకు అందించాల్సిన పాలనను ఇలా బూతులు తో కూడిన ఆడియో వైరల్ కావడంతో జిల్లాలో ఈ అంశంపై చర్చ తీరు రూపం దాల్చింది. ఆడియో పై పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.