06-04-2025 12:00:00 AM
మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కేవలం శరీరానికి మాత్రమే కాకుండా కళ్ల ఆరోగ్యంపై కూడా ప్రభావితం చూపుతాయి. ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామందికి కళ్లజోడు అవసరం అవుతున్నది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఏడు వరకు బ్లుండ్నెస్ వీక్ నిర్వహిస్తారు. కళ్లకు సంబంధించి అవగాహన పెంచడానికి, కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెబుతారు.
రోజువారీ ఆహారంలో విటమిన్ ఏ,సీ, ఈ, ఒమోగా ఫ్యాటీ ఆసిడ్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. పాలకూర, నారింజ పండ్లు, డ్రైఫ్రూ ట్స్, ద్రాక్ష మొదలైనవి కంటిశుక్లం సమస్యను నివారించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ఈ పదార్థాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.
సూర్యుని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు కళ్లకు హాని కలిగించవచ్చు. ఇవి కళ్ల క్యాన్సర్ వంటి సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి వందశాతం బయటకు వెళ్లేముందు యూవీ రక్షణ కలిగిన సన్‌గ్లాసెస్ పెట్టుకోవడం ముఖ్యం. ఇవి కళ్లను పొడిచేసే దుమ్ము, ధూళి హానికరమైన కిరణాల నుంచి రక్షిస్తాయి.
కంప్యూటర్, ఫోన్, టెలివిజన్ వంటి డిజిటల్ స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్లు డ్రై నెస్ అవుతాయి. కాబట్టి స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం అవసరం. ఇందుకోసం 20 నియమాన్ని పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలోని వస్తువును, 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.