calender_icon.png 19 March, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్డిపై నడిస్తే..

02-03-2025 12:00:00 AM

బయటకు వాకింగ్ కోసం వెళ్లామంటే తప్పని సరిగా షూ వేసుకుని వెళ్తాం. అలా పార్కుల్లోని వాకింగ్ ట్రాకుల్లో కొన్ని రౌండ్లు నడిచి ఇంటికి వచ్చేస్తాం. అయితే షూ, చెప్పులు తీసేసి గడ్డిమీద 20 నిమిషాలు నడిస్తే ఎంతో మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

* ఉదయం పచ్చని గడ్డిలో చెప్పులు లేకుండా నడిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. శరీరానికి కావలసిన ఆక్సిజన్ అందుతుంది. ఒత్తిడి సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 

* తీవ్ర ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. 

* నిద్రలేమితో బాదపడేవారు ఓ 30 నిమిషాల గడ్డిలో చెప్పుల్లేకుండా నడిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

* గడ్డిపై ఇలా నడవడం వల్ల గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.