calender_icon.png 26 September, 2024 | 1:55 AM

ఆ టైమ్‌లో నిద్రలేస్తే..

24-09-2024 12:00:00 AM

తెల్లవారుజామున, సంధ్యా సమయంలో చదువుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేవగలిగితే, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని, ఫలితంగా చదువుకున్నదంతా బుర్ర కెక్కుతుందని పెద్దలు చెబుతారు. ఈ సమయంలో వ్యా యామం చేసినా, మంచి మానసిక ఆరోగ్యం సొంతం.

* రాత్రి త్వరగా పడుకుని, ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవడం వల్ల జీవితం చక్కబడుతుంది. చదువుకునేవారు కింది రోజువారీ అలవాట్లను అలవాటు చేసుకుంటే మరింత క్రమబద్ధంగా, ఏకాగ్రతతో అధ్యయనం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. 

* ఉదయం పూట శబ్దం తక్కువగా ఉంటుంది. పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి మనస్సు చెదిరిపోదు. మానసికంగా బలంగా ఉంచేందుకు సులభతరం చేస్తుంది. చదవడానికి కూర్చుంటే ఏకాగ్రత వస్తుంది. ఉదయం, మనస్సు స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టమైన, సంక్లిష్టమైన సమస్యలపై సాధన చేస్తే, పరిష్కారం దొరుకుతుంది. 

* వ్యాయామం, ధ్యానం చేయడంతోపాటు మీకు ఏవైనా హాబీలు ఉంటే వాటిని నెరవేర్చుకోవడానికి కూడా ఈ సమయం ఉపయోగపడుతుంది. మొత్తంగా అన్ని అంశాలలో తనను తాను అభివృద్ధి చేసుకోవాలనే కోరిక, ఆసక్తి ఉన్నవారు ఉదయం పూట నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 

* ఉదయాన్నే నిద్ర లేచినట్లయితే చదువులు, పరీక్షల గురించి ఆందోళన తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మెదడులోకి సానుకూల ఆలోచనలు వస్తాయి. ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.