చాలామంది తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు నిపుణులు. అలసట, బరువు తగ్గడం లేదా అధిక దాహం వంటి లక్షణాలతోపాటు తరచుగా మూత్ర విసర్జన చేయడం డయాబెటిస్ లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను తెలియజేస్తుంది.
మూత్రం రంగులో తేడాలంటే ఇతర అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా అత్యవసరంగా మూత్రవిసర్జనకి కారణమవుతాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట ఉండొచ్చు.
కిడ్నీ వ్యాధులు కూడా తరచుగా మూత్ర విసర్జనతో సమస్యలను కలిగిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఏదైనా ఇతర వ్యాధులు ఉంటే, మూత్రం ఏర్పడే ప్రక్రియ చెదిరిపోతుంది. అలాంటి సందర్భాలలో తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం ఉండొచ్చు. కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
అలాగే షుగర్ టైప్‌ౌ టైప్‌న రెండూ కూడా మూత్రవిసర్జనకి కారణమవుతాయి. గర్భిణులకు హార్మోన్ల మార్పులు, మూత్రాశయం మీద ఒత్తిడి కారణంగా మూత్రవిసర్జన ఫీలింగ్ వస్తుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది కూడా ఎక్కువగా అధిక మూత్రవిసర్జనకి కారణమవుతుంది. తరచుగా ఈ సమస్యతో బాధపడినట్టయితే కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.