- డీకోడ్ చేసిన వారికి బంపర్ ఆఫర్
- శతాబ్ది ఉత్సవాల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన
చెన్నై, జనవరి 5: సింధూ లో య నాగరికత బయల్పడి శతా బ్ద కాలం అవుతోంది. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు అంతర్జాతీయ శతాబ్ది ఉత్సవాలను చెన్నైలో నిర్వహిస్తున్నారు. ఈ కార్య క్రమాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సింధూ నాగరికతను వెలికితీసి వంద సంవత్సరా లు పూర్తవుతున్నా.. నేటికీ ఆ లిపిని అర్థం చేసుకోలేకపో యామన్నారు.
ఆ లిపిని డీకోడ్ చేసి విశ్లేషించిన వారికి ౮.౫ కోట్ల (మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీ అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. వ్యక్తులు లేదా సంస్థలైనా సింధూ లిపిని డీకోడ్ చేయొచ్చని సూచించారు. ప్రపంచ పురాతన నాగరికతల్లో సింధూ నాగరికతకు ఎంతో పేరుందన్నారు. పట్టణ సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఈ నాగరికత వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోలేకపోవడం ఇప్పటికీ ఓ చిక్కుగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అద్భుత నాగరికత మరుగునపడే అవకాశముందన్నారు.