calender_icon.png 31 October, 2024 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థాయికి మించి ఆలోచిస్తే..

22-06-2024 12:05:00 AM

చిన్న వయసులో అధిక ఒత్తిడికి గురి అయితే.. తర్వాతి కాలంలో జ్ఞాపక శక్తి తగ్గడానికి కారణం అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. స్థాయికి మించిన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి అనుభవా లు వయసు పెరిగే కొద్దీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ అధికంగా ఉన్నాయని న్యూయార్క్ సైకాలజిస్టుల అధ్యయనంలో వెల్లడైంది.  బిజీ లైఫ్ షెడ్యూల్, వర్క్ ప్రెజర్, పర్సనల్ ప్రాబ్ల మ్స్ వంటివి 30 ఏండ్లలోపు వారిలో ఆందోళనకు, ఒత్తిడికి కారణం అవుతున్నాయి. అలా గే 18 ఏండ్లలోపు వారిని చదువుకునే సమయంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, పేద రికం, సామాజిక ఒంటరితనం వంటివి మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి.

కొందరిని డిప్రె షన్‌లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తిని బలహీన పర్చడంలో చిన్న వయసులో ఎదుర్కొనే అధిక ఒత్తిడి అనుభవాలు కీలకాపాత్ర పోషిస్తున్నాయని ఫ్రాన్స్‌లోని బోర్డి యక్స్ యూనివర్సిటీ నిపుణులు చెప్తున్నారు. అధ్యయనంలో భాగంగా వీరు నిద్ర, ఆకటి, ఏకాగ్రత, సోషల్ ఐసోలేషన్, డిప్రెషన్, విచా రం వంటి అంశాలను ఎనలైజ్ చేశారు. అయి తే వయసు పెరిగే కొద్ది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అయితే ఈ డిప్రెసివ్ డిజార్డర్ లక్షనాలు అందరిలో ఒకేలా ఉండటం లేదు. ఆయా వ్యక్తులు పుట్టి పెరిగిన వాతావరణం, ఒత్తిడిని వారు స్వీకరించి, ఫీలయ్యే విధానం వంటివి ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.