వనపర్తి టౌన్, జనవరి 29:- విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని ఆచరణాత్మక విధానం ద్వా రా బోధిస్తే సులువుగా పట్టు సాధిస్తారని, బాగా గుర్తు ఉండిపోతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
బుధవారం కలెక్ట రేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో కొనుగోలు చేసిన 116 సైన్స్ ఫెయిర్ కిట్లను ప్రభుత్వ పాఠశా లలకు కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు వన పర్తి జిల్లాలో గత 35 సంవత్సరాలుగా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ సెక్రటరీ చిన్నమ్మ థామస్‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.