* ఏఐసీసీ కార్యదర్శి సంపత్
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మాటలు రాజకీయాలకే తలవంపుగా ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాలు ఇంత నీఛంగా ఉంటాయా? అని దేశం మాట్లాడుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం సంపత్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ .. ఫార్ములా ఈ రేస్, డ్రగ్స్ కేసు, జన్వాడ ఫామ్‌హౌస్, ఫోన్ ట్యాపింగ్, ధరణి, ఓఆర్‌ఆర్ అమ్ముకోవడం లాంటి పనులతో కేటీఆర్ రాష్ట్రానికి తలవంపులు తెచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తాటా తీస్తామని హెచ్చరించారు.
సీబీఐ విచారణకు వెళ్లొచ్చిన కేటీఆర్‌కు హారతులు ఇస్తున్నారని, ఆయనేమైనా దేశానికి సేవ చేశారా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి సంజయ్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.