03-03-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ మోతీలాల్
చెన్నూర్, మార్చి 2 (విజయక్రాంతి) : క్రమశిక్షణతో చదివితే ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోగలమని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ ఆన్నారు. ఆదివారం సాయంత్రం జైపూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను, ఎస్సీ బాలుర హాస్టల్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. స్వయంగా విద్యార్థులకు వడ్డించి వారితో పాటు కూర్చుని భోజనం తిన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సబ్జెక్టుల వారిగా ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆయా సబ్జెక్టులలో ఉన్న అంశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు స్వయంగా బోధన చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్ వెంట అధికారులు తదితరులు ఉన్నారు.