calender_icon.png 16 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాన్ కోసం ఆగితే.. 35 లక్షలు చోరీ

01-09-2024 01:51:42 AM

  1. బైక్‌పై వచ్చి బ్యాగ్ ఎత్తుకెళ్లిన దుండగులు  
  2. కేసు నమోదు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): పాన్ కోసం ఆగితే రూ. 35 లక్షలు ఉన్న బ్యాగును దుండగులు  ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్‌లోని తిబర్మల్ జ్యువెల్లర్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దుకాణాన్ని మూసివేసి బ్యాగులో రూ.35 లక్షల క్యాష్‌ను తీసుకొని తన సహచరుడి బైక్‌పై అత్తాపూర్‌లోని తన నివాసానికి బయలుదేరాడు. ఈ క్రమంలో మెహదీటపట్నం పిల్లర్ నంబర్ 28 వద్ద రేతిబౌలి ఎక్స్ రోడ్డు సమీపంలో ఉన్న షాపులో పాన్ కోసం ఆగాడు. అదే సమయంలో హెల్మెల్ ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తన చేతిలోని బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.