ప్రతిరోజూ తలస్నానం చేస్తే, హాని చేస్తుందని, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని సైన్స్ చెబుతోంది. చలికాలంలో రోజూ తలస్నానం చేయకపోతే ఆరోగ్యం దెబ్బతినదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. అధికంగా స్నానం చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో హెయిర్ వాష్ అనేది మైగ్రేనుకు దారితీస్తుంది. చాలామంది ఈ రకమైన తలనొప్పిని ఎదుర్కొంటున్నారని పరిశోధనల్లో తేలిం ది.
వారానికి మూడు సార్లు తల స్నానం చేసి అదే తడితో జుట్టును అల్లడం వల్ల నొప్పి రావడంతోపాటు చివరికి మైగ్రేన్ బారిన పడుతున్నారు. మహిళలు రోజు తలస్నానం చేయడం వల్ల నూనెలు స్రవించే శాతం తగ్గిపోతాయి. దీంతో శిరోజాలు పొడిబారిపోతాయి
ఏం చేయాలంటే..
- స్నానం చేసిన వెంటనే జుట్టును బాగా ఎండనివ్వాలి.
- వారంలో రెండుసార్లు తలస్నానం చేయొచ్చు.
- చాలా మంది తల జిడ్డుగా ఉంటుందని నూనె పెట్టుకోరు.
- జుట్టుకు తేమ అందాలంటే రోజూ నూనె పెట్టుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- తలస్నానం తర్వాత తలనొప్పి వస్తే తగినంత నీరు తాగాలి.