ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీలో మద్యం అమ్మకాల నిషేధిస్తూ గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం
షాద్ నగర్, జనవరి 28 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని ఉప్పరి గడ్డ గ్రామ పంచాయతీ పెద్దలు మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆదర్శమైన నిర్ణయం తీసుకున్నారు.
అమ్మినవారికి రూ .40వేలు,కొన్నవారికి రూ20వేల జరిమానా విధిస్తామని అందులో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు ఓటర్లకు మందు పంపిణీ చేస్తే రూ.4 లక్షల జెరిమానా విధిస్తామని నిర్ణియం తీసుకున్నారు.
అదేవిధంగా మద్యం అమ్ముతున్న,పంచుతున్న సమాచారాన్ని గ్రామ పెద్దలకు అందిస్తే రూ.10 వేలు పారితోషికం ఇస్తామని మాజీ సర్పంచ్ చందు నాయక్ మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ తీర్మాన నిర్ణయాల వినతి పత్రాన్ని షాద్నగర్ పోలీస్ స్టేషన్ పట్టణ సీఐ విజయకుమార్ కు అంద జేశారు. మధ్య నిషేధం కొనసాగే విధంగా సహకరించాలని గ్రామ పెద్దలు పోలీసులని కోరారు