calender_icon.png 20 January, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా రీ బూస్ట్ చేసుకుంటా..

12-08-2024 12:00:00 AM

హీరో రవితేజ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానుంది. వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. తాజాగా యాంకర్ సుమ ఇంటర్వ్యూకు హీరో రవితేజతో కలిసి హాజరైన ఈ మరాఠీ మందారం.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. “మేమిద్దరం (రవితేజను కూడా ఉద్దేశిస్తూ..) డ్యాన్స్‌లో చేయడంలో నిపుణులం కాదు.

సంగీతాన్ని ఆస్వాదిస్తూ నర్తిస్తుంటాం. మా అమ్మ డ్యాన్స్ టీచర్. చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారామె. నేను చిన్నప్పుడు బొద్దుగా ఉండేదాన్ని. అందుకే నాకు సరిగ్గా డ్యాన్స్ చేయడం వచ్చేది కాదు. అది చూసి చాలా మంది గేలి చేశారు. పెద్దయిన తర్వాత ఎలాగైనా మంచి డ్యాన్సర్ కావాలని నిర్ణయించుకున్నా. అలా డ్యాన్స్‌ను ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్న నేను ఎప్పుడైనా డల్‌గా అనిపిస్తే డ్యాన్స్, మ్యూజిక్‌నే ఆశ్రయిస్తా.. అలా రీ బూస్ట్ చేసుకుంటా” అని చెప్పింది.

ఇంకా దర్శకుడు హరీశ్ శంకర్ గురించి చెప్తూ.. “కథ ఏమిటన్నదే చెప్పారు.. పూర్తి స్క్రిప్ట్ వివరించలేదు. ‘నన్ను నమ్ము.. నీకు అందమైన రోల్ ఇస్తున్నా..’ అన్నారాయన. అప్పుడే ఆయన కళ్లల్లో సినిమాపై ఉన్న అభిమానం చూశా.. వెంటనే ఓకే చెప్పేశా. జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం ఇదే” అని చెప్పింది భాగ్యశ్రీ.