calender_icon.png 9 January, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలకృష్ణ డైలాగులన్నీ కలిపేస్తే దబిడి దిబిడి!

03-01-2025 12:22:36 AM

బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న సినిమా ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో గీతమూ శ్రోతలకు అందుబాటులోకి వచ్చింది. ‘దబిడి దిబిడి’ పాటను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. బాలకృష్ణ చిత్రాల్లోని పలు పాపులర్ డైలాగులతో రూపుదిద్దుకున్న ఈ తాజా గీతం అభిమానులను మధురానుభూతి కల్పించే సంగీత సాగర తీరంలో విహరింపజేస్తోంది. ఈ మాస్ డాన్స్ సాంగ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించారు.

ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా ఆడిపాడారు. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తమన్ సంగీత సారథ్యంలో వాగ్దేవి ఆలపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్; కళా దర్శకుడు: అవినాష్ కొల్లా; కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్.