ధర్మ, ఐశ్వర్యశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డ్రింకర్ సాయి’ సినిమా నుంచి ‘నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ శనివారం విడుదలైంది. ఈ పాటకు శ్రీవసంత్ స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. జెస్సీ గిఫ్ట్ పాడారు. హీరోయిన్‌ను హీరో టీజ్ చేస్తూ పాడే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఇంకా పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్‌ఎస్ కాంచి, భద్రం తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నారు.