calender_icon.png 25 November, 2024 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణను వ్యతిరేకిస్తే బహిష్కరించాలి

25-11-2024 01:53:07 AM

పిడమర్తి రవి, సోమచంద్రశేఖర్

ఖమ్మం, నవంబర్ 24 (విజయక్రాంతి): వర్గీకరణకు సంబంధించి సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించే కాంగ్రె స్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయ కులు పిడమర్తి రవి, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఖ మ్మం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు.

వరంగల్ డిక్లరేషన్‌లో ఏఐసీ సీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని హా మీ ఇచ్చారని, ఆ హామీతోనే మాదిగ సామాజిక వర్గం పార్టీ గెలుపునకు కృషి చేసిందని చెప్పారు. మాదిగ జాతి ఓట్లతో గెలిచిన చె న్నూరు ఎమ్మెల్యే, మరికొంత మంది గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఈ విషయమై రా హుల్‌గాంధీకి, ఖర్గేకు ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావ హించాలని, ఇష్టం లేకపోతే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. వారివెంట నాయకులు మట్టె గురుమూర్తి, తోళ్ల రాకేష్,  క్రాంతి, దూడ అర్జున్ ఉన్నారు.