calender_icon.png 18 January, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో ఉంచితే!

09-01-2025 12:00:00 AM

అందం నుంచి ఆరోగ్యం వరకు నిమ్మకాయ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ తొక్కలను కూడా ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. అలాగే నిమ్మకాయ ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. 

నిమ్మకాయ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రిజ్‌లో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫ్రిజ్‌లోని గాలిని సహజంగా శుభ్రపరుస్తుంది. 

ఫ్రిజ్ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు దుర్వాసన సమస్య కొనసాగుతూనే ఉంటుంది. చాలాసార్లు ఈ వాసన రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఆహార పదార్థాలలో కూడా కనిపిస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో దుర్వాసనను తొలగించాలంటే నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిజ్‌లోని దుర్వాసనను దూరం చేస్తుంది. గాలిని తాజాగా, సువాసనగా ఉంచుతుంది. 

చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత కూడా త్వరగా చెడిపోయేవి కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు నిమ్మరసాన్ని ఉపయోగించాలి. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం కుళ్లిపోకుండా చేస్తాయి. 

ఫ్రిజ్‌లో కొన్ని నిమ్మకాయ ముక్కలను ఉంచడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే.. ఇది ఫ్రిజ్‌లో ఉన్న గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది. నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి.