గంభీరంగా, మౌనంగా అన్నీ చూస్తున్నా
- ప్రజలు అత్యాశతో తులం బంగారం కోసం కాంగ్రెస్‌కు ఓటేశారు
- కాంగ్రెస్‌వాళ్ల సోషల్ మీడియాలోనే బీఆర్‌ఎస్‌కు 70శాతం పోల్ చేశారు
- ఇక పోరుబాటే.. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ
- ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్
గజ్వేల్, జనవరి 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులకు గురువుతున్నారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం చెప్పిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాను గంభీరంగా.. మౌనంగా చూస్తున్నాని, తాను కొడితే ఒట్టిగ కొట్టనన్నారు. గట్టిగానే కొట్టాల్సి వస్తుందని చెప్పారు. ఏడాదిలోనే కాంగ్రెస్ నాయకులు దొరికితే కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అత్యాశకు పోయి తులం బంగారం ఆశతో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, కైలాసం ఆటలో పెద్దపాము ఒకేసారి మింగినట్టుగా ప్రస్తుత తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి సోషల్ మీడియాలో సర్వే చేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ 70శాతం పోల్ చేశారన్నారు. ఫాం హౌస్ అంటూ బద్నాం చేస్తున్నారని.. ఫాంహౌస్‌లో మక్కలు, వరి, అల్లం, గడ్డి ఉంటాయన్నారు. జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ప్రాజెక్టు పనులన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టును ఎండగడుతు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిపాదించినట్టుగా ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సభకు జహీరాబాద్ నాయకులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ శక్తిని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాలన్నారు.
శుక్రవారం సంగారెడ్డి జహీరాబాద్ ఝరాసంఘం కేతకి సంఘమేశ్వరాలయం వద్ద ఐదు రోజుల క్రితం మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్ పాటిల్ ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరిన జహీరాబాద్ బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం ఎర్రవల్లి కేసీఆర్ ఫాంహౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు తగ్గాయ ని, కోటి రూపాయల భూమి కూడా లక్షల రూపాయల ధరనే పలుకుతున్నదని కేసీఆర్ చెప్పా రు. మారుమూల ప్రాంతాల్లో కూడా రూ. 40 నుంచి రూ. 50 లక్షలు ఎకరానికి ధర పలికేదని, ఇప్పు డు మొత్తం నాశనం చేశారన్నారు.
బీఆర్‌ఎస్ హ యంలో ఏడాదికి 15వేల కోట్ల చొప్పున రాష్ట్ర ఆదాయం పెరిగిందని, కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి 13వేల కోట్ల ఆదాయం తగ్గిందని ఇటీవల వెల్లడించిన కాగ్ నివేదిక తెలిపిందన్నారు. మార్చి వరకు వరకు 15వేల కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని కేసీఆర్ వెల్లడించారు.
ఈ పరిస్థితుల్లో ఇక పథకాలేమి అమలు చేయలేరని, మరో నాలుగైదు నెలల్లో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంటుందని, రిటైర్డ్ అయిన వారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై ప్రజలు వందకు వందశాతం ఒక నిర్ణయానికి వచ్చారని, ఇక మనం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రం లో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పడప్పుడు కొన్ని దుష్టగ్రహాలు వచ్చి చెడుకాలం దాపురిస్తుందని, మన వాళ్లు కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని కేసీఆర్ గుర్తు చేశారు. జహీరాబాద్ ప్రజలు తెలివిమంతులు కాబట్టి మాణిక్‌రావును గెలిపించుకున్నారన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపించడం వల్ల తెలంగాణ కు ఒక మంచి గుణపాఠం అయ్యిందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులు అప్పు లు తీర్చి డబ్బులు జమచేసుకున్నారని, రైతుబం ధు డబ్బులు ఖాతా లో పడగానే ఎంతో సంతోషపడేవారన్నారు. యాదవులకు గొర్రె లు, ముదిరాజ్‌లకు చేపపిల్లలను పంపిణీ చేశామని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశామన్నారు.
ఇప్పుడు రైతులకు రైతుబంధు ఇస్తారో లేదో దేవునికే తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటర్లను వాడుకున్నదే తప్ప వారికి ఎలాంటి లబ్ధి చేకూర్చ లేదన్నారు. ఇమాం, మౌజేలకు వేతనాలు ఇచ్చా రా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక కడుపునొప్పితో ఇండ్లకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని, తాగునీరు సరిగా రావడం లేదని.. దీనిని అడిగే నాథుడే కరువయ్యారన్నారు. గట్టిగా ఎవరైనా అడిగితే పోలీసులను పెట్టి కేసులు చేస్తున్నారని చెప్పారు. సింగూరు నుండి సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా ద్వారా రెండు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల చొప్పు న సాగునీరు అందించేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు.
అది తిరిగి తాను లైన్‌లోని వస్తేనే సాధ్యమవుతుందన్నారు. అందరికీ న్యాయం జరుగాలంటే మనమే కొట్లాడాలని, తెగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాల న్నా రు. అవసరమైన సమ యంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు పిలుపునిస్తారని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాల క్ష్మా రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.