calender_icon.png 5 March, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదు

05-03-2025 01:37:27 AM

గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందికి మంత్రి దామోదర హెచ్చరిక

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4(విజయక్రాంతి): వైద్యులు, ప్రొఫెసర్లు, ఆర్‌ఎం  ముందస్తు సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం  హెచ్చరించారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, డాక్టర్లు అందుబాటు  లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

నేరుగా పేషెంట్ల వార్టుకు వెళ్లి రోగులతో మా  అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం విధులకు గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్, డీఎంఈలను ఆదేశించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.