calender_icon.png 25 January, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగులేటికి దమ్ముంటే రాజీనామా చేసి కందాలపై పోటీ చేయాలి

24-01-2025 11:34:59 PM

మళ్ళీ పోటీ చేస్తే పొంగులేటికి డిపాజిట్లు కూడా దక్కవ్...

ఖమ్మం (విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవంటున్నారు... పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిజంగా చేతనైతే... దమ్ముంటే రాజీనామా చేసి, కందాల ఉపేందర్‌రెడ్డిపై పోటీ చేయాలని, డిపాజిట్లు కూడా దక్కవని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మంత్రి పొంగులేటిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ దగుల్బాజీ చర్యల వల్ల గ్రామ సభల్లో ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలే స్వచ్చందంగా తిరగబడుతున్నారని అన్నారు. ఘర్షణలు వెనుక బీఆర్‌ఎస్ ఉందని చెప్పడం అవివేకమన్నారు. కొన్ని చోట్ల ఇందిరమ్మ కమిటీల వారు కూడా ధర్నా చేస్తున్నారని, దీనికేమి అంటారని చెప్పారు. ఏ ఒక్క గ్రామ సభలోను పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనలేదని అన్నారు. గ్రామ సభల్లో పేరు రాగానే పథకాలు అన్నీ వచ్చినట్లేనని భావిస్తున్నారని, లిస్టులో ఎలిజిబిలిటి లిస్ట్  చదవడం లేదని, అది చదివితే అధికారులు, నాయకుల గుడ్డలు ఊడదీసి కొడతారని అన్నారు.

గ్రామ సభలు చూసి, కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేశామా...? అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎక్కడా గొడవలు జరగకుండా గ్రామ సభలు జరగలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ... 420 హామీలు ఇచ్చి చేతగాక చేతులెత్తేశారని అన్నారు. పథకాల అమలుకు సంవత్సరకాలం దరఖాస్తులు తీసుకున్నారని, ఇక అమలుకు ఎన్ని ఏళ్లకాలం పడుతుందోనని ఎద్దేవా చేశారు.  గ్రామ సభల ద్వారా ప్రభుత్వ చాతగాని తనం బహిర్గతమైందన్నారు. ఎన్నిసార్లు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యంతో గ్రామాల్లో ప్రజలు  వర్గాలుగా విడిపోతున్నారని అన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామాల్లో ప్రజల మద్య గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా గ్రామ సభలు వ్యతిరేకించమని తాము ఎక్కడా  పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ, మాజీ ఎంపిపి దొడ్డ శ్రీనివాసరావు,  నాయకులు కర్నాటి కృష్ణ, బెల్లం వేణు, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.