11-02-2025 01:22:25 AM
* కేటీఆర్‌కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉం టే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని రాజీనామా చేయాలనే హక్కు కేటీఆర్‌కు లేదని హితవు పలికారు.
సోమవారం సీఎ ల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్‌రెడ్డిని బరిలోకి దింపి గెలిపించుకుంటామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కొడంగల్ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ జడ్పీటీసీ లేదా ఎంపీపీని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.
రాజీనామాకు సీఎం రేవంత్ రెడ్డి అవసరం లేదని, తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌కు జైలుకు పోతాననే భయం పట్టుకున్నదని, అందుకే పగటి వేషగాడిలా మాట్లాడుతున్నారని దుయ్య బట్టారు. కొడంగల్ అభివృద్ది కోసం ప్రభుత్వం రూ.6,128 కోట్లు కేటాయించిందన్నారు.