07-04-2025 01:14:46 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): ‘బండి సంజయ్‌కు దమ్ముం టే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను 9వ షె డ్యూల్ చేర్చి, దానికి చట్టబద్దత కల్పిం చేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పిం చాలి’ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో సవాల్ విసి రారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ కనీసం అల్పాహారం కూడా తినరని ఎద్దేవా చేశారు.
తాను కేంద్ర మంత్రి అనే విషయా న్ని మరిచిపోయి దిగజారుడు రాజకీ యా లకు పాల్పడుతున్నారని మండిప డ్డా రు. సుదీర్ఘకాలం నుంచి పార్టీ రాష్ట్ర అధ్య క్షు డిని నియమించుకోలేని బీజేపీ నేతలు రా ష్ట్రప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూ రమని విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి పాల నపై పూర్తి పట్టు సాధించా రని, బీసీ రిజర్వే షన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు అందుకే సాధ్య మయ్యాయని స్పష్టం చేశారు.
హెచ్‌సీ యూ భూముల అం శం ప్రస్తుతం సర్వో న్నత న్యాయ స్థానం పరిధిలో ఉందని, సున్నితమైన ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీ కూడా వేసిందని గుర్తు చేశారు. ఇలాంటి సందర్భంలో బండి సంజ య్ హెచ్‌సీయూ భూముల అంశాన్ని రాజకీయం తగదని హితవు పలికా రు. తమ ప్రభుత్వం తెలంగాణకు చెందిన నిరుపే దలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే దేశవ్యా ప్తంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని సవాల్ విసిరారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆ మోదం కోసం సీఎం రేవంత్‌తో పాటు కాం గ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ధర్నా చేపడితే బీజేపీ నేతలు ఎందుకు మో హం చాటేశారని నిలదీశారు. తమ పార్టీలో సమష్టి నిర్ణయాలకే ప్రాధాన్యం ఉంటుందని, బీజేపీలో మాత్రం డిల్లీ పెద్దల పెత్తనమే నడుస్తుందని దుయ్యబట్టారు.