calender_icon.png 3 February, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ముంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రజాతీర్పుకు రండి

03-02-2025 12:00:00 AM

రామగుండంలో కేంద్ర ప్రభుత్వంపై నిరసనలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

రామగుండం, ఫిబ్రవరి 2 : దమ్ముంటే బిజెపి పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి ప్రజా తీర్పుకు రండి అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు బడ్జెట్ నిధు లు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిరసనలో ఎమ్మెల్యే  గాంధీ విగ్రహం ముందు  ధర్నా నిరసన తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్న రాష్ట్రాలలో వివక్షత చూపు తూ... బడ్జెట్ కేటాయించకపోవడం ఆ రా ష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయడం బిజెపి పార్టీ నిరంకుశ ప్రజాస్వామ్య విరుద్ధమ న్నారు.

ఒక బిజెపి పాలిత రాష్ట్రాలక ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రధాని వివరిస్తున్నారని, తెలంగాణ రాష్ర్టంకు తీవ్ర అన్యాయం చేశా రుని, ఎనిమిది  పార్లమెంటు స్థానాలు గెలిపిస్తే ఇప్పుడు కూడా విభజన హామీలు ఏ మాత్రం పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడం సిగ్గుచేటన్నారు. 

ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.