20-02-2025 01:07:09 AM
* ఎమ్మెల్యే సొంత నిధులతో 224 మంది మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి
* మన ఎదుగుదలతోనే ఆర్థిక స్వాలంబన సాధ్యం
* ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
* ప్రతి పనికి ప్రాధాన్యత ఉంటుంది : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి) : మనకు ఏదో ఒక పని వచ్చి ఉంటే ఆ నైపుణ్యతతోనే విజయతీరాలకు చేరుకుంటామని ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బికే రెడ్డి కాలనీలో గల ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటుచేసిన 224 వృత్తి నైపుణ్య ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన 224 మంది మహిళలు మీరే మహబూబ్ నగర్ రోల్ మోడల్స్, మీరు శక్తికి ప్రతి రూపమన్నారు. ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ముందు కుటుంబానికి, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడుతుందనే ఒక మంచి ఆలోచన, సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అందు లో భాగంగానే మీలో దాగిన ట్యా లెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యం తో ఈ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందన్నారు.
మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే అని ఆయన స్పష్టం చేశారు. మహిళలు బాగుంటేనే కుటుంబం సైతం బాగుంటుందని, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందన్నారు. మహబూబ్ నగర్ లో ట్యాలెంట్ కు కొదవే లేదని మీరు నిరూపించారని ఆయన అన్నారు. మయూరి అనే బ్రాండ్ ను మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భంగా విస్తరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలనుకొన్నా అందుకు అండగా ఉంటాన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పి డి జానకి, తదితరులు ఉన్నారు.
అనంతరం ముఖ్య అతిథులు శిక్షణ పొందిన మహిళలకు మెమౌంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పరిశ్రమల శాఖ జి.ఎం.ప్రతాప్ రెడ్డి, డి.పి.అర్. ఓ శ్రీనివాస్, డిఎస్‌ఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.