calender_icon.png 6 March, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రోత్సాహం ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు

06-03-2025 12:36:14 AM

వనపర్తి టౌన్, మార్చి 05:  ప్రోత్సాహం ఉంటే విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని  సి. విరామన్ టాలెంట్ పాఠశాలలో నిర్వహించిన వైద్య విజ్ఞాన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వైద్య విజ్ఞాన ప్రదర్శన ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శనలు తిలకించారు.తెలంగాణ సంస్కృతులను, వృత్తి నైపుణ్యాలను, ఆధునిక కాలంలో ని త్యం ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలను విద్యార్థులు కన్నులకు కట్టినట్లు రూపొందించారు. విద్యార్థుల సృజనాత్మకతను చూసి మాజీ మంత్రి మురిసిపోయా రు.శ్రద్ధగా ప్రదర్శన చూసి వివిధ విభాగాలలో విద్యార్థులు రూపొందించిన అంశాలు ను చూసి వారిని అభినందించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు విద్యార్థులను ప్రోత్సహించి వారిలో ఉన్న నైపుణ్యా న్ని వెలికితీస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు అని ఆయన కొనియాడారు. ఇంత గొప్పగా వైద్య విజ్ఞాన ప్రదర్శన నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని,అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం లో వాకిటి. శ్రీధర్, నందిమల్ల. అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి,కంచ. రవి,శివ లక్ష్మణ్, పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ మురళీధర్, డాక్టర్ శారద, డాక్టర్.హరికృష్ణ,డాక్టర్ ప్రత్యూష, డాక్టర్. సిద్ధార్థ, డాక్టర్.మౌనిక,సత్తార్ సార్, నవీన్ కుమార్, షబానా పాల్గొన్నారు.