calender_icon.png 6 March, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం విషయంలో ఇబ్బందులుంటే తెలపండి.. పరిష్కరిస్తాం

26-01-2025 12:30:44 AM

శ్రీ పాద స్మారక ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో చైర్మన్ దుద్దిళ్ల  శ్రీను బాబు

మహదేవపూర్, జనవరి 25 (విజయ కాంతి): ప్రజల ఆరోగ్యం  విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న మా దృష్టికి తీసుకు రావాలని శ్రీ పాద స్మారక ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో శ్రీ పాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల  శ్రీను బాబు అన్నారు. జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలో శనివారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్  శాసన సభ మాజీ స్పీకర్  దుద్దిళ్ళ శ్రీపాద రావు  స్మారకార్థం వరంగల్ చక్రవర్తి హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల ఆరోగ్యం విషయంలో పార్టీల కు అతీతంగా కలిసి పనిచేస్తామని, ఆరోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ  శిబిరాన్ని ప్రజలు  ఉపయో గించుకోవాలని కోరారు.  చక్రవర్తి ని, సిబ్బందికి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాపు, మాజీ ఎంపీపీ బుచ్చక్క, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.