calender_icon.png 22 December, 2024 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దవాఖానకు పోతే నిలువు దోపిడే?

15-10-2024 12:43:26 AM

  1. రాసినవన్నీ తేవాలె.. చెప్పిన చోటే కొనాలె?
  2. రోగులకు హాస్పిటల్స్ నిర్వాహకుల హుకూం
  3. చికిత్స పూర్తయ్యేలోపు తడిసి మోపెడవుతున్న బిల్లులు
  4. వనపర్తిలో చెలరేగుతున్న మెడికల్ మాఫియా

వనపర్తి, అక్టోబర్ 1౪ (విజయక్రాంతి): అక్కడ దవాఖానలకు వెళ్తే రోగం తిరగడం ఖా యం.. స్కానింగ్, రక్త, మూత్ర పరీక్షలంటూ ని లువు దోపిడీ చేసే దవాఖానల నిర్వాహకులు.. మరో దందాకు తెరతీశారు. డాక్టర్ రాసే అడ్డగోలు మందులు తాము చెప్పిన మెడికల్ షాపులోనే కొనాలని షరతు పెడుతున్నారు.

మందులు కొనేవరకు డాక్టర్ చీటి రోగికి ఇవ్వకుండా అట్టిపెట్టుకుంటున్నారు. గత్యంతరం లేక వైద్యులు రాసిన మందులు చెప్పిన దుకాణంలోనే కొనుక్కోవాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అడ్మిట్ అయిన రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఆసుపత్రిలో చేరిన రోగి వారి చేతుల్లో కీలు బొమ్మగా మారాల్సి వస్తోంది.

చెప్పినట్టు మందులు కొనాల్సిందే. లేదంటే రోగం ముదిరి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందనే సిబ్బంది మాటలకు బెంబేలెత్తిపోయి రోగి కుటంబీకులు అప్పోసప్పో చేసి కుమ్మరించాల్సిన దుస్థితి దాపురి ంచింది. ఇదంతా హైదరాబాద్ నగరంలో జరి గే తతంగం కాదు.. మన వనపర్తి పట్టణంలో నిత్యం జరుగుతున్న సంఘటనలు.

వైద్యం కోసం వస్తే అవసరం లేని పరీక్షలతోనే రోగిని దోచుకుంటున్న వైద్యులు.. మందులు అంటగడుతూ ౩౦ శాతానికి పైగా లాభాలు  గడిస్తు న్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దవాఖానలోని మెడికల్ షాపులను వేరేవారికి ఇవ్వకు ండా యాజమాన్యాలే నడుపుతున్నారు.

నేరు గా మందుల కంపెనీలే తమ రిప్రజెంటీవ్స్‌తో హాస్పిటల్ మెడికల్ షాపులకు మందులను హోల్‌సేల్‌గా సరఫరా చేస్తున్నారు. వనపర్తిలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోందని సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

అడ్మిట్ అయితే ఆరిపోవుడే 

హాస్పిటల్‌లో వైద్యం కోసం అడ్మిట్ అయితే ఇక అంతే సంగతి. అడ్మిషన్ కోసం డిపాజిట్ డబ్బులు మొదలుకొని డిశ్చార్జి అయ్యేవరకు నగదు కుమ్మరించాల్సిందే. మెడికల్ షాపు దందా అదనం. అడ్మిట్ అయిన రోగిని పర్యవేక్షణలో పెట్టిన తరువాత పరీక్షలు, మందులను రాస్తూనే ఉంటారు.

ఈ రోగం తక్కువ అవుడు దేవుడెరుగు.. ఆర్థిక రోగం తప్పకుండా వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. శస్త్రచికిత్సల సమయంలో రాసే మందులు, వస్తువుల చిట్టా చూసి రోగుల గుండె ఆగిపోయేంతలా ఉందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికార యంత్రాంగం మెడికల్ మాఫియాపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. 

మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిమితికి మించి పరీక్షలు, మందులను రాస్తున్నట్టు మా దృష్టికి రాలేదు. అలాంటివి ఉంటే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. తప్పకుండా అలాంటి దవాఖానలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలతోపాటు పరీక్షలు సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రజలంతా ప్రభుత్వ అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలి. 

 జయచంద్రమోహన్, జిల్లా వైధ్యాధికారి , వనపర్తి