విజయనగర రాజుల పాలనలో రాజధానిలో ఓ వెలుగు వెలిగిన హంపిలో.. ఎక్కడ చూసినా అద్భుత దృశ్యాలే కనిపిస్తాయి. హంపిలో స్తంభాలు సంగీతాన్ని వినిపిస్తాయి. అయితే అక్కడ స్తంభాలు మాత్రమే కాదు.. చదునైన రాళ్లు కూడా సంగీతాన్ని వినిపిస్తాయి.
హంపి విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప నగరం. అక్కడి దేవాలయాలు, నిర్మాణాలు, శిల్పాలు, భవనాలు అద్భుతంగా ఉంటా యి. అక్కడ చూడటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన హంపిలోని విజయ విఠల దేవాలయంలోని స్తంభా లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ స్తంభాలను 15వ శతాబ్దంలో నిర్మించారు. విఠల దేవాలయంలోని 56 సప్తస్వర స్తంభాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ.
ఈ స్తంభాల నుంచి వెలువడే పంచవాద్య, జల తరంగ, ఘంటసాల, బడి గంట, కాలింగ్ బెల్, ఘట్వాద్య, ఢమరుకం, మృదంగం, వీణ నాదాలను వినేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ వాటి రక్షణ కోసం భారత పురావస్తు శాఖ 2000 సంవత్సరంలో సంగీత మందిరంలోని స్తంభాలను తాకకూడదని నిషేధం విధించింది. కానీ ప్రస్తు తం కొన్ని వైరల్ వీడియోలు సంగీతాన్ని వింటున్న మరికొన్ని నిర్మాణాలను చూపుతున్నాయి.
ఆలయంలోని రంగ మండపంలో ఉన్న 56 స్తంభాలు వివిధ తాళ వాయిద్యాల ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో నాలుగు రాళ్లు ఉన్నాయి. వాటిపై ఓ వ్యక్తి చేతులతో కొట్టడాన్ని చూడవచ్చు. కొట్టిన ప్రతిసారీ సంగీతం ఉద్భవిస్తుంది. మ్యూజిక్ పోల్స్ లాగా వీటిని మ్యూజిక్ ప్యానెల్స్ అంటారు. వేళ్లతో కొట్టినప్పుడల్లా రాళ్లు శ్రావ్యమైన శబ్దాలను వినిపిస్తున్నాయి.