calender_icon.png 3 April, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పినవన్నీ ఇస్తే మరోసారి మీరే మా ఎమ్మెల్యే

29-03-2025 12:38:23 AM

 నెలకు 2500 ఇవ్వాలని కోరిన మేస్త్రి శిక్షణ కార్యక్రమంలో మహిళలు 

మహబూబ్ నగర్ మార్చి 28 (విజయ క్రాంతి) : మీరు చెప్పినవన్నీ ఇస్తే మరోసారి మీరే మా ఎమ్మెల్యే అంటూ మహిళ మేస్త్రీల శిక్షణ కేంద్రంలో మహిళలు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని అడిగారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బండమీది పల్లి దగ్గర మహిళలకు అందిస్తున్న మేస్త్రి శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహారం చేరుకొని మహిళలు నేర్చుకుంటున్న పని  విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  దృష్టికి పలు విషయాలను మహిళా మేస్త్రిలు తీసుకొచ్చారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే చాలని, ఉద్యోగాలు కల్పన కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే చెప్పినవన్నీ ఇచ్చిన తర్వాతే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతామని పేర్కొన్నారు. 

శిక్షణ బాగా నేర్చుకొని ముందుకు సాగాలని సూచించారు. సిమెంట్ తయారీ కేంద్రాలకు సంబంధించిన మిషన్లను కూడా ప్రభుత్వం తరఫున అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మహిళలను పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేస్తామని తెలియజేశారు. మహిళలకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి సంబంధించి (నవరత్నాలు) కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించి వారు నేర్చుకున్న పని విధానాన్ని కి సంబంధించి వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకు వారు రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, హౌసింగ్ కోఆర్డినేటర్ వైద్యం భాస్కర్ ,తాసిల్దార్ తదితరులు ఉన్నారు