17-04-2025 12:00:00 AM
పట్టుదల స్వయంకృషితో మీ కుటుంబాలు తలెత్తుకునేలా చదవండి: ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ ఏప్రిల్ 16 (విజయ క్రాంతి) : నిరుద్యోగులుగా కాకుండా మీరు ఆశించిన మేరకు బాగుపడితే నా జన్మ సార్థకమవుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఎస్సై, కానిస్టేబుల్, వీఆర్వో, టెట్, డీఎస్సి పోటీ పరీక్షలకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయ లు ఖర్చుపెట్టిన లేక మెరుగైన శిక్షణవిద్యకు దూరంగా ఉంటున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా శిక్షణనను పోటీ పరీక్షల నిమిత్తం అందించడం జరుగుతుందన్నారు. పట్టుదల స్వయంకృషితో మీరు మీ కుటుం బం ఆశించిన మేరకు ఉద్యోగాలు పొందాల ని సూచించారు. అవస రమైన సదుపాయాలు అన్ని కల్పిస్తామని ప్రత్యేకంగా సమయం కేటాయించి బాగా చదివి ఉద్యోగాలు పొం దాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసిం హారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ నేతలు గుండా మనోహర్, శ్రీనివాస్ యాదవ్,ఆవేజ్ తదితరులు ఉన్నారు.
ఆకాష్ విద్యాసంస్థను నెలకొల్పడం సంతోషం: ఎమ్మెల్యే యెన్నం
నాణ్యమైన విద్యను దేశ విదేశాల్లో మన విద్యార్థులు సులభంగా రాణించేందుకు అందుబాటులోకి తీసుకురావడం అనేది గొప్ప విషయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తా సమీపంలో ఆకాష్ మెడికల్, ఐఐటి, జెఈఈ లతో కూడిన కళాశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఆకాష్ విద్యాసంస్థ మహబూబ్ నగర్ లో నెలకొల్పడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. నాణ్యమైన విద్యను ఇక్కడ విద్యార్థులకు అందిస్తూ మంచి విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చలవగాలి రాఘవేంద్ర రాజు, ఆకాశ విద్య సంస్థల ప్రతినిధులు ఉన్నారు.