calender_icon.png 25 January, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరగడుపున తింటే...

16-01-2025 01:20:04 AM

ప్రతిరోజు పరగడుపున నెయ్యి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. ముఖ్యంగా నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ శరీరంలోని అదనపు కొవ్వులను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతిరోజూ ఉదయం చెంచా నెయ్యిని పరగడుపున తీసుకొవడం చాలా మంచిది.  అంతకుమించి తినడం హానికరమని గుర్తుంచు కోండి. అలాగే ఒక చెంచా నెయ్యి తినడం వల్ల పేగుల్లో లూబ్రికేషన్ అందుతుంది. ఆహారం సులభంగా కదిలేందుకు సహాయపడుతుంది.

ఫలితంగా మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే మంచి కొవ్వులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఖాళీ కడుపుతో చెంచా నెయ్యి తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది, రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బు ల ప్రమాదం తగ్గుతుంది. నెయ్యిలో ఉండే విటమిన్లు చర్మాన్ని బిగుతుగా, మృదువుగా, లోపలి నుంచి మెరిసేలా చేసేందుకు సహాయపడతాయి. అలాగే వృద్ధాప్య సమస్యలను కూడా తగ్గించవచ్చని నిపుణు లు చెబుతున్నారు.