calender_icon.png 15 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాసిరకం భోజనం పెడితే జైలుకే

15-11-2024 01:46:05 AM

  1. కులగణనకు అడ్డొచ్చే వారిని ద్రోహులుగా గుర్తించండి  
  2. 2025లో కేంద్రం మెడలు వంచి కులగణన చేయిస్తాం
  3. విశ్వవిద్యాలయాల్లో  త్వరలో ఖాళీల భర్తీ చేపడతాం
  4. గంజాయి, డ్రగ్స్‌కు విద్యార్థులు బానిసలు కావొద్దు
  5. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు  తరచూ పాఠశాలలను సందర్శించాలి
  6. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పించాలి
  7. బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కలుషిత ఆహారం పెడితే కఠినంగా శిక్షిస్తామని, నాసిరకం సరుకులు స రఫరా చేస్తే జైలుకు వెళ్లడం తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విద్యా ర్థులకు నాణ్యమైన ఆహారం పెట్టేందుకే ప్ర భుత్వం డైట్ చార్జీలను పెంచిందని స్పష్టంచేశారు.

తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరుగెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు బానిసలు అవుతున్న పరిస్థితి చూస్తే బాధేస్తోందని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం నిర్వహించిన బా లల దినోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు.

గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో తమ ప్ర భుత్వం డైట్ చార్జీలను 40 శాతం పెంచిన ట్టు తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్‌లో కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ‘విద్యార్థులారా.. మీరే ఈ తెలంగాణకు పునాదులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే మాలాం టి వారిమి ఈ వేదికపై ఉన్నాం.

అందుకే గురుకులాలను తక్కువగా అంచనా వేయవద్దు. విద్యకు ప్రాధాన్యమిస్తేనే రాష్ర్టం అ భివృద్ధి పథంలో పయనిస్తుంది. దొడ్డుబి య్యం, పాచిపోయిన అన్నం పెడితే ఊరుకునేది లేదు. తెలంగాణ గురుకులాల్లో సన్న బియ్యంతో ఆహారం అందించాలనే సన్న వడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నాం.

60 లక్షల మంది విద్యార్థులే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ప్రజాప్రతినిధులు, డాక్టర్స్, లాయర్స్, ఇంజినీర్స్, ఉన్నతాధికారులుగా, సీఎంలుగా ఎదగాలి’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘కుక్క పిల్ల చనిపోతే డాక్టర్‌ను జైల్లో వేసిన పరిస్థితి నాటి ముఖ్యమంత్రిది.

మాసాయిపేలో బస్సును రైలు ఢీకొన్న ఘటనలో అనేక మంది విద్యార్థులు చనిపోతే కనీసం కన్నీరు కూడా కార్చలేదాయన. కానీ ఈ ముఖ్యమంత్రి మీతో నడిచి మీతో చేయి కలుపుతున్నాడు. ఇవాళ మీతో కలిసి బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాడు. దీనికి కారణం ప్రభుత్వం మారింది.. రాష్ర్టంలో మార్పు వచ్చింది’ అని అన్నారు. 

సర్కారులో ౨26 లక్షల మంది.. ప్రైవేటులో 36 లక్షల మంది

రాష్ట్రంలోని 26,854 ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదు వుకుంటుంటే.. 11వేల ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల మంది చదువుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకున్న అర్హతలు, నైపుణ్యం.. ప్రైవేటులో ఉండవని, కానీ ఎందుకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారో సభలో ఉన్న 2 వేల మంది టీచర్లు ఆలోచించాలని సూచించారు.

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధు లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పరిశీలించాలని, విద్యార్థుల సమస్యలు తెలుసుకోలని సూ చించారు. వారంలో 2 రోజులు ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించాలని, లేదంటటే సరు కలెకర్ల పదోన్నతుల సమయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటామని పే ర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖకు బడ్జెట్‌లో 7 శాతం నిధులు రూ. 21వేల కోట్లు కేటాయించినట్టు స్పష్టంచేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అటెండర్స్, స్వీపర్స్, పారిశు ద్ధ్య నిర్వహణకు సింగరేణి ద్వారా ఏటా రూ.150 కోట్లు కేటాయించామని వివరించారు.

త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు. మాజీ ఐఏఎస్  అధికా రి మురళి నేతృత్వంలో విద్యారంగంలో స మూల మార్పులు తెచ్చేందుకు విద్యాకమిషన్ నియమించుకున్నామని తెలిపారు.

20 23 డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియం వేదికగా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని, ఇప్పుడు ఇక్కడే ఏడాది పాలన విజయోత్సవాలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రా రంభ కార్యక్రమమే చిన్నారులది కావడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే నెల 9 వర కు ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు.

21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి 

దేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందని, 21 ఏళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు కోసం అసెంబ్లీలో ప్రతిపాదనలు చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు, డిఫ్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేస్తున్నానని రేవంత్‌రెడ్డి అన్నారు. దీనివల్ల రాజకీయాల్లో యువతరానికి అవకాశాలు, ప్రాతినిధ్యం మరింతగా పెరుగుతాయన్నారు.  

రాష్ట్రంలో విద్యకే తొలి ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రంలో విద్యకు తొలి ప్రాధాన్యం తమ ప్రభుత్వ విధానమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వ పాఠ శాలలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యావ్యవస్థను బాగు చేశామని స్పష్టంచేశారు.

ఏడా ది పాలన విజయోత్సవాలు  విద్యార్థులతో ప్రారంభించ డం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులను రేపటి తెలంగాణ ఆస్తి గా భావించి, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.  

గురుకుల విద్యార్థులకు సన్మానం 

వాటర్ స్పోర్ట్స్ క్రీడాంశాల్లో జాతీయ స్థా యిలో సత్తా చాటిన గురుకులాల విద్యార్థు లు స్రవంతికి రూ.50 వేలు, మాలోత్ ప్రభాకర్‌కు రూ.25వేలు, భ్యూక్యా సంజయ్ నాయక్‌కు రూ.25 వేల నగదు బహుమతిని సీఎం రేవంత్‌రెడ్డి అందించారు. తెలంగాణ విద్యా ప్రగతి సూ చిక పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. అంగన్‌వాడీ పుస్తకాన్ని ఆవిష్కరించి, అంగన్ వాడీ విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు. 

మీ చప్పట్లు ఫాంహౌస్‌లోని కేసీఆర్‌కు వినిపించాలె

తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరుగెత్తుతోందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ‘వ్యసనాలకు బానిసలం కాబోమని విద్యార్థులంతా చప్పట్లతో మాట ఇవ్వాలి.. ఇది ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్‌కు వినిపించాలి’ అని అన్నారు. ‘మీ చప్పట్ల శబ్ధంతో ఫాంహౌస్‌లో దీపావళి దావత్ చేసుకున్న వారి గుండెలు పగలాలి’ అని చెప్పారు.

వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నానమని తెలిపారు. క్రీడల్లో రాణించిన నికత్ జరీన్, సిరాజ్‌లకు డీఎస్పీలుగా ఉద్యోగాలు ఇచ్చామని, పారాఒలంపిక్స్‌లో సత్తా చాటిన దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, ఇల్లు ఇచ్చామని చెప్పారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, మట్టిలో మణిక్యాలని వెలికితీసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వివరించారు.  

కేంద్రం మెడలు వంచి 2025లో కులగణన చేయిస్తాం 

కుటుంబ సర్వే కోసం వస్తున్న ఎన్యూమరేటర్లకు పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలని సీఎం కోరారు. 50 శాతం దాటి రిజర్వేషన్లు, దామాషా ప్రకారం నిధులు రావాలంటే, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలంటే కులగణన జరగాలని అన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని పేర్కొన్నారు.

కొంతమంది కుట్ర పూరితంగా కులగణన సర్వేపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఇది ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తొలగొంచడానికి కాదని, కులగణన సర్వే మెగా హెల్త్ చెకప్ లాంటిదని స్పష్టంచేశారు. కులగణన సర్వేకు అడ్డు వస్తే వారిని ద్రోహులుగా భావించాలని కోరారు.

కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరాజు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొంటాం: డిప్యూటీ సీఎం భట్టి  

విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం ఎన్ని కోట్ల రూ పాయలైనా ఖర్చు చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు పాలించి మెస్ చార్జీ లు కూడా పెంచలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగా నే 40 శాతం మెస్ చార్జీలు పెంచామన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇంటిగ్రే టెడ్ పాఠశాలల నిర్మాణానికి రూ.5వే ల కోట్లు కేటాయించామన్నారు.