calender_icon.png 21 February, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందు బాబులకు షాకింగ్ న్యూస్...!

20-02-2025 01:06:43 PM

ఇకపై మద్యం తాగి వాహనం నడిపితే జైలు తప్పదు.

మైనర్లు వాహనాలు నడిపితే శిక్ష తల్లి దండ్రులకే 

శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్.

జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మందు బాబులకు జిల్లా ఎస్పీ చేదు వార్తలు అందించారు. ఇకపై తాగి వాహనాలు నడిపే వారిపట్ల కఠినంగా వ్యవహరించి జైలుకు పంపాల్సి వస్తుందని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 22 శనివారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహణ జరుగుతోందని నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు రోడ్లపై తీసుకువస్తే సీజ్ చేస్తామని, తాగి వాహనం నడిపినా జైలుకు పంపుతామని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు, వాహన యజమానికి చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా మండలాల వారిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహణ జరుగుతోందని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ పేర్కొన్నారు.